బొల్లాపల్లి మండలంలో రైతు ఆత్మహత్య
పంట నష్టం తో అప్పులు తీర్చలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య.
న్యూస్‌తెలుగు/వినుకొండ: బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల లో మోటపోతులు వెంకటేశ్వర్లు S/o సుబ్బయ్య అనే రైతు అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు…
నూతన కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాన్ని వెంటనేఆదుకొని ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ వెంటనే అందే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని రైతు కుటుంబ పక్షాన విజ్ఞప్తి చేయడం జరిగింది
గత నాలుగైదు సంవత్సరాల నుండి మిర్చి పంట వేస్తూ నాలుగు సంవత్సరాల నుండి పంటలు పండక, సరైన గిట్టుబాటు ధర లేక 15 లక్షలు అప్పులుకావడం వల్ల, అప్పులు తీర్చలేక ఆ బాధ తట్టుకోలేక ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన పై బండ్లమోట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు… మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదేవిధంగా వినుకొండ నియోజకవర్గం లో అనేక మంది రైతులు వ్యవసాయం చేసి ప్రకృతి అనుకూలించక నకిలీ విత్తనాల వల్ల అనేకమంది గత ఐదేళ్ల గా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వెంటనే రైతులొ చైతన్యం తెచ్చి రైతుల ఆత్మహత్యలు నివారిస్తారని కోరుతూ
ఉలవలపూడి రాము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. (Story : బొల్లాపల్లి మండలంలో రైతు ఆత్మహత్య)