పార్కింగ్ చేసిన కారు నుంచి రూ. 28 లక్షలు స్వాహా
న్యూస్‌తెలుగు/బెల్లంపల్లిః పార్కింగ్ చేసిన కారు నుంచి రూ. 28 లక్షలు స్వాహా చేసిన ఉదంతం కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో పార్కింగ్ చేసిన కారులో వుంచిన రూ. 28 లక్షల నగదును గుర్తుతెలియని అగంతకులు దొంగిలించారని ఫిర్యాదుదారుడు బిపిన్ కుమార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కంపెనీకి సంబంధించిన డబ్బును సేల్స్ బాయ్స్ కారులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్ళగా దొంగతనానికి జరిగిందని పేర్కొన్నారు. మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. (Story : పార్కింగ్ చేసిన కారు నుంచి రూ. 28 లక్షలు స్వాహా)