Home వార్తలు తెలంగాణ భారతదేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించిన ప్రభుత్వాలే ప్రజాదరణ పొందుతాయి

భారతదేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించిన ప్రభుత్వాలే ప్రజాదరణ పొందుతాయి

0

భారతదేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించిన ప్రభుత్వాలే ప్రజాదరణ పొందుతాయి

రాజేందర్ రెడ్డి కృషి విశ్వవిద్యాలయాలకు మించి వ్యవసాయ సంస్కరణలకు నాంది

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించిననాడు వ్యవసాయాన్ని మించిన పరిశ్రమ ఉండదు

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : గత రెండు రోజులుగా నల్గొండ జిల్లా N.G కళాశాల మైదానంలో రైతుబడి ఆగ్రిషో పేరిట రాజేందర్ రెడ్డి నిర్వహిస్తున్న రైతు చైతన్య ఆధునిక వ్యవసాయ పద్ధతుల అధ్యయన సదస్సులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నేడు ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వేల సంవత్సరాల క్రింద భారతదేశ మూలవృత్తి వ్యవసాయంగా కొనసాగిందని, రక రకాల వ్యాపారాలు వ్యవసాయాన్ని ఆవహించి నిర్లక్ష్యం చేయబడ్డదని ఈ ప్రక్రియ భవిష్యత్తు తరాలకు ప్రమాద ఘంటికలు సూచిస్తుందని అందరం అప్రమత్తం కావలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డదని అన్నారు.రైతులు ఖాడే క్రింద పడేసిననాడు అందరి భవిష్యత్తు అంధకారమే అందరికీ అన్నం కరువు అవుతుందని అన్నారు. స్వానుభవం పొందిన రైతే నిజమైన శాస్త్రవేత్త అని ఆయన రైతులను కొనియాడారు. నేటి ప్రభుత్వాలు వాటి మనుగడ కోసం రైతులను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయి తప్ప భవిష్యత్తు తరాల గూర్చి ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని ఆధునిక కాలంతో పోటీపడి రోజువారీగా ఎంతమంది కూలీలు అవసరం మరియు ట్రాక్టర్, వరికోత,వంటి సౌకర్యాలు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న నాడు రైతులకు పెట్టుబడి తగ్గుతుందని ఆదిశగా రైతులను చైతన్యం చేయాలని విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు.
విశ్వవిద్యాలయాలు రైతులకు ఒక గ్రూపుకు,వ్యక్తులకు,సంఘాలకు, సోసైటీలకు వాడే మిషనరిని అందుబాటులో ఉంచగలుగుతే వారి పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరిగి వ్యవసాయం అభివృద్ధి దిశగా సాగుతుందని అన్నారు.
రైతు భూమిని తల్లిగా పంటను బిడ్డగా పంటపండే వరకు ఒక తప్పసుగా రైతు ఆచరిస్తాడని అందుకే రైతే రాజు అన్న నినాదం నిజమైంది అని అన్నారు.
కె.సి.ఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతుబంధు,రైతు భీమా, ఋణ మాఫీ సకాలంలో ఇచ్చి రైతును అగ్రభాగాన నిలిపిందని……నేటి ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి రైతును గోసపెడుతుందని ఋణ మాఫీ అందరికీ అని అసంపూర్తి చేసి రైతులను రోడ్డు పాలుజేసిందని అన్నారు.
నిర్వాహకులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడో గౌరవ నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన వ్యవసాయ సలహాలు సూచనలు నన్ను ఈ బృహత్ కార్యక్రమానికి పురికొల్పింది అని అందుకు నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
వేలాది రైతుల సమక్షంలో గౌరవ నిరంజన్ రెడ్డి గారిని రాజేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర బి.ఆర్.ఎస్ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : భారతదేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించిన ప్రభుత్వాలే ప్రజాదరణ పొందుతాయి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version