‘వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు’
న్యూస్‌తెలుగు/ వినుకొండ : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 38వ వార్షిక బ్రహ్మోత్సవములు ఈనెల 16 శుక్రవారం నుండి ఇదే నెల 20వ మంగళవారం వరకు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవ్వేతంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ దేవస్థాన పాలకవర్గ సభ్యులు అధ్యక్షులు రెడ్డి బంగారయ్య ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు కోశాధికారి కాళ్ళ రామ కోటేశ్వరరావు వీరి చేతుల మీదగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు మూడవ రోజుకు చేరుకున్నాయి18 వ తారీఖు నాడు ఈరోజు ఉదయం 8:00 నిమిషాల నుండి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవం మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం 6:30 నుండి నిత్య హోమం శ్రీ లక్ష్మీ సహస్రనామ కుంకుమారాధన రాత్రి 8:30కు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు 19వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి పంచామృత స్థాపన ఉదయం 11 గంటల నుండి శ్రీవారి అపూర్వ రథోత్సవం పట్టణ పురవీధుల గుండా 20వ తారీకు నాడు ఉదయం 8 గంటల నుండి నిత్య హోమం చక్రస్నానోత్సవము మధ్యాహ్నం ఒంటిగంటకు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు మరియు ఆలయము నందు ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు సంతానము లేని దంపతులకు గరుడ ప్రసాదము ఇవ్వబడును అని తెలిపారు. (Story : ‘వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు’)