ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా
దార్శినికత అవసరం
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన
న్యూస్‌తెలుగు/విజయవాడ : ప్రభుత్వ మార్గదర్శకాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా దార్శినికత, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు అన్ని శాఖల ప్రగతికి స్పష్టమైన ఆలోచనల ప్రణాళికను రూపొందించి ఈనెల 31వ తేదీలోగా సీపీవో కార్యాలయానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డా.జీ.సృజన ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వికసిత్ ఆంధ్రా`2047కు రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపని చేసేందుకైనా సరైన దార్శినికత, ప్రణాళిక ఉంటేనే ఆ పని విజయవంతమవుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో గణనీయ పురోగతి సాదించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను రూపొందించేందుకు నిబద్దత, చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు. ప్రతి శాఖ తమ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి, కీలక అంశాలను నమోదు చేయాలన్నారు. పేదరిక నిర్మూలన, సాంఫీుక, బౌతిక, మౌళిక వసతుల అభివృద్ది, జీవన సౌలభ్యం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపు, అత్యంత నాణ్యమైన సేవలు, టెక్ ఆనుసందాన ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత కలిగిన డిజిటల్ గవర్నెన్స్ అంశాలకు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఏటా 15శాతం వృద్ది లక్ష్యానికి అనుగుణంగా శాఖల వారీగా వృద్ది చోదక శక్తులను గుర్తించాలని, నిపుణులు, ముఖ్య సంస్థల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీవో శ్రీలత, జిల్లా పరిశ్రమల అధికారి సుధాకర్, పౌరసరఫరాల డీఎం వెంకటేశ్వర్లు, సమగ్రశిక్ష అడిషనల్ పీడీ మహేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఉద్యానవనాధికారి బాలాజీకుమార్, వీఎంసీ అదనపు కమిషనర్ సత్యవతి తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.