అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి – ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/కొమురం భీo ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అడీసీసీ బ్యాంకు శాఖను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు సందర్శించారు.రైతులు పాక్స్ లో జరిగిన అవినీతిని సిర్పూర్ శాసనసభ్యులు హరీష్ బాబు దృష్టికి తీసుకుచ్చారు.డీసీసీబీ సీఈఓ తో మాట్లాడి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఈ విషయం పై లేఖ రాస్తామని. రుణమాఫీ లబ్ధిదారులు , ఖాతాదారులు రోజుకు 100 మంది చొప్పున తమ ఆధార్ మరియు పట్టాదారు పాస్ పుస్తకాన్ని బ్యాంకు మేనేజర్ కు చూపించి రుణమాఫీ డబ్బులను , రుణమాఫీ జరిగిన ఖాతాలో నుంచి అదనపు పంట రుణం తీసుకోవచ్చని సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.(Story:అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి – ఎమ్మెల్యే
)