‘వైష్ణోయ్ సౌత్ వుడ్స్’ని ప్రకటించిన వైష్ణోయ్ గ్రూప్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: హైదరాబాద్‌లోని అతిపెద్ద, అత్యంత విశ్వసనీయ నిర్మాణ సంస్థలలో ఒకటైన వైష్ణోయ్ గ్రూప్, తన తాజా విలాసవంతమైన ప్రాజెక్ట్ ‘వైష్ణోయ్ సౌత్ వుడ్స్’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ రాజేంద్రనగర్‌లోని తమ ప్రెస్టీజ్ నిర్వాణ క్లబ్‌లో ఛానెల్ పార్టనర్ మీట్‌ను నిర్వహించింది. ఇది అద్భుత విజయాన్ని సాధించింది. వైష్ణోయ్ గ్రూప్ చైర్మన్ యెలిశాల రవిప్రసాద్, డైరెక్టర్లు హేమచంద్ర, శరత్‌చంద్ర, కృష్ణారెడ్డి వారి నిర్వహణ బృందం, సిబ్బంది సమక్షంలో దాదాపు 250 మంది ఛానెల్ భాగస్వాములు ప్రాజెక్ట్ ఆఫర్లను తెలుసుకున్నారు. ‘వైష్ణోయ్ సౌత్ వుడ్స్’ అనేది నివసించడానికి ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఇది జీవనశైలి ఎంపిక, విలాసం, సౌలభ్యం, సౌకర్యం కచ్చితమైన సమ్మేళనం’’ అని యెలిశాల రవి ప్రసాద్ పేర్కొన్నారు. 43.5 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన తోటల మధ్య నెలకొల్పబడిన ఈ సంపన్న విల్లాప్రాజెక్ట్ విలాసవంత సౌకర్యాల శ్రేణిని అందిస్తుంది. ఇది వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్ రోడ్, మామిడ్‌పల్లి, శంషాబాద్ సమీపంలో ఉంది. (Story : ‘వైష్ణోయ్ సౌత్ వుడ్స్’ని ప్రకటించిన వైష్ణోయ్ గ్రూప్)