తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాలు సహకార అభిర్విద్ధి సంస్థ చైర్ పర్సన్ ప్రీతమ్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రీతమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ ఆర్.గిరిధర్, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాంఅని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ యం. నగేష్, జిల్లా అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు)