78 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న సతీష్ యాదవ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సంబరాలు లో పాల్గొని ఘనంగా జెండా పండుగ జరుపుకున్న సందర్భంగా మొదటగా తిరుమల హిల్స్ లో తిరుమల మహేష్ జరిపిన జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి , తిరుమల మహేష్ గారు జెండా ఎగరవేశారు. తరువాత 30వ వార్డులోని ఐజయ్యనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎగురవేసిన జండా కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అక్కడ చిన్నారులకు పాఠశాల టీచర్లు, వార్డ్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ విద్యార్థి విద్యార్థినిలకు స్వీట్లు పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే , తిరుమల హిల్స్ అధినేత తిరుమల మహేష్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, మాజీ ఎంపీపీ కురుమయ్య, ధనలక్ష్మి, సత్యారెడ్డి, రహీం, కౌన్సిలర్స్, ఉమ్మల్ల రాములు తదితరులు పాల్గొన్నారు. (Story : 78 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న సతీష్ యాదవ్)