జెట్వెర్క్ బోర్డులో వినోద్ కుమార్ దాసరి
న్యూస్‌తెలుగు/బెంగుళూరు: ప్రపంచంలోని అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ మార్కెట్‌ప్లేస్ అయిన జెట్వెర్క్ తాజాగా వినోద్ కుమార్ దాసరిని డైరెక్టర్ల బోర్డులో సభ్యునిగా నియమించినట్లు వెల్లడిరచింది. ఆటోమోటివ్, ఇంజినీరింగ్‌తో సహా విభిన్న రంగాలలో ప్రముఖ, స్కేలింగ్ తయారీ వ్యాపారాలలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవాన్ని దాసరి తీసుకువస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రెన్యూవబుల్స్, ఇండస్ట్రియల్స్ వంటి కీలక రంగాలలోకి వ్యూహాత్మకంగా ప్రవేశించడం ద్వారా వృద్ధి పథంలో పయనిస్తున్న కంపెనీకి, కీలకమైన సమయంలో దాసరి జెట్వెర్క్ బోర్డులో చేరారు. విజయాల పరంగా నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌తో, అతను జెట్వెర్క్ నాయకత్వ బృందానికి అమూల్యమైన మార్గదర్శకత్వం, వ్యూహాత్మక పరిజ్ఞానాన్ని అందిస్తారు. ఆయన జూలై 1, 2024న జెట్వెర్క్ బోర్డులో చేరారు. (Story : జెట్వెర్క్ బోర్డులో వినోద్ కుమార్ దాసరి)