‘మై హోమ్ అక్రిడా’ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని గోపనపల్లి నుంచి తెల్లాపూర్ వెళ్లే రోడ్డులో ‘మై హోమ్ అక్రిడా’ పేరుతో మై హోమ్ గ్రూప్ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించింది. గోపనపల్లి`తెల్లాపూర్ కారిడార్‌లో ఇది అత్యంత ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందనున్నది. బహుళ దశల్లో అభివృద్ధి కానున్న సమీకీత టౌన్‌షిప్‌లలో ఒకటైన తెల్లాపూర్ టెక్నో సిటీ మూడో ఫేజ్‌లో భాగంగా అక్రిడా ప్రాజెక్టు నిర్మితమవుతున్నది. లివ్, వర్క్, ప్లే అనే మూడు అంశాల సంస్కృతి ఆధారంగా లగ్జరీ లివింగ్ టౌన్‌షిప్‌గా ఇది ఉండబోతున్నది. ప్రతిమా గ్రూప్ భాగస్వామ్యంతో మై హోమ్ గ్రూప్ ఈ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే 1,400 బుకింగ్స్ పూర్తికావడం విశేషం. ఇది గచ్చిబౌలి, హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో ఉంటుంది. 3,780 ఫ్లాట్లతో 12 మేజిస్టిక్ టవర్స్ నిర్మితం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. (Story : ‘మై హోమ్ అక్రిడా’ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభం)