ఆరెంజ్‌థియరీ ఫిట్‌నెస్’ హైదరాబాద్‌కు వచ్చేసింది!
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: సైన్స్ అండ్ టెక్నాలజీతో సమ్మిళితమైన ప్రముఖ ఫిట్‌నెస్ బ్రాండు ‘ఆరెంజ్‌థియరీ ఫిట్‌నెస్’ సెంటర్ ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేసింది. బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ 7లో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో సరికొత్త ఆరెంజ్‌థియరీ ఫిట్‌నెస్ స్టుడియోను నెలకొల్పుతున్నట్లు ఆరెంజ్‌థియరీ ఫిట్‌నెస్ ఇండియా వ్యవస్థాపకులు, చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. సాధారణ ఫిట్‌నెస్ సెంటర్‌లా కాకుండా హార్ట్ రేట్ ఆధారంగా ఇంటర్వెల్ ట్రెయినింగ్ ఇవ్వడం, రియల్‌టైమ్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేపట్టడం, సరికొత్త మోనటరింగ్ టెక్నాలజీని పొందుపర్చడం, అండర్ ట్రెయినింగ్‌ను అధిగమించేలా రిస్క్‌లు లేని ఫిట్‌నెస్ లక్ష్యాలను ఏర్పర్చడం వంటి ప్రత్యేకతలు ఈ స్టుడియోలో వుంటాయన్నారు. సర్టిఫైడ్ కోచ్‌లు అందుబాటులో వుంటారని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలకు ఇదొక ప్రీమియమ్ ఫిట్‌నెస్ స్టుడియోగా ఉంటుందని చెప్పారు. (Story : ఆరెంజ్‌థియరీ ఫిట్‌నెస్’ హైదరాబాద్‌కు వచ్చేసింది!)