‘ట్రాజోడోన్’ టాబ్లెట్‌కు అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: పెద్దవారిలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ చికిత్స కోసం ఉపయోగించే ‘ట్రాజోడోన్’ టాబ్లెట్‌కు అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) ఆమోదం లభించిందని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. ఈ ట్రాజోడోన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్ యూఎస్పీ 50 ఎంజీ, ఎంజీ, ఎంజీ, 300 ఎంజీ కలవన్నారు. ఇది ప్రాగ్మా ఫార్మాస్యూటికల్స్ ఎల్‌ఎల్సీ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ అన్నారు. రాబోయే త్రైమాసికాలలో మార్కెట్ వాటా స్థిరంగా పెరుగుతుందన్నారు. గ్రాన్యూల్స్ ఇప్పుడు అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) నుంచి 65 ఏఎన్డీఏ ఆమోదాలు (64 తుది ఆమోదాలు,1 తాత్కాలిక ఆమోదం) కలిగి ఉన్నామన్నారు. ఎంఏటీ జూన్ 2024, ఐక్యూవీఐఏ/ఐఎంఎస్ హెల్త్ ప్రకారం.. ట్రాజోడోన్ టాబ్లెట్‌ల కోసం ప్రస్తుత వార్షిక యూఎస్ మార్కెట్ సుమారు 128 మిలియన్ల డాలర్లు అన్నారు. (Story : ‘ట్రాజోడోన్’ టాబ్లెట్‌కు అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం)