అనంతపురం అల్ట్రాటెక్ లైమ్‌స్టోన్ గనికి 5 స్టార్ రేటింగ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ కు చెందిన పన్నెండు లైమ్‌స్టోన్ మైన్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ద్వారా 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఈ అవార్డులను 2024న ఆగస్టు 7న దిల్లీలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బహుకరించారు. అవార్డు పొందిన పన్నెండు గనులలో ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలోని తుమ్మలపెంట లైమ్‌స్టోన్ గని ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్, అల్ట్రాటెక్ ఇంటిగ్రేటెడ్ యూనిట్‌లో భాగం. ఈ యూనిట్ ఈ అవార్డును గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి భారత్ లోని అతిపెద్ద సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ని మైనింగ్, భారతదేశపు మైనింగ్ రంగానికి దోహదపడిన అన్ని అంశాలలో ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించినందుకు సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే కూడా పాల్గొన్నారు. (Story : అనంతపురం అల్ట్రాటెక్ లైమ్‌స్టోన్ గనికి 5 స్టార్ రేటింగ్)