Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పవన్‌ కల్యాణ్‌పై పుష్ప అభిమానుల ఆగ్రహం !

పవన్‌ కల్యాణ్‌పై పుష్ప అభిమానుల ఆగ్రహం !

పవన్‌ కల్యాణ్‌పై పుష్ప అభిమానుల ఆగ్రహం !

న్యూస్‌ తెలుగు/అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై అల్లు అర్జున్‌ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య మనస్పర్థనలు ఉన్నట్లు ప్రచారంలో ఉండగా, తాజాగా పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. కర్ణాటక`ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఈనెల 6వ తేదీన కర్ణాటకలో అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రం తరపున పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ బి.ఖండ్రేతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహిస్తూ…రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల్ని పరిష్కరించినట్లు వెల్లడిరచారు. అంతటితో పవన్‌ ఆగకుండా…కన్నడ కంఠీరవ, అగ్ర కథనాయకులు రాజ్‌ కుమార్‌ నటించిన‘గంధద గుడి’ చిత్రంలో అటవీ పరిరక్షణగాఉండే డీఎఫ్‌ఓ పాత్రను హీరోగా చిత్రంలో చూపారని, ఇప్పుడు ఆ తీరు మారింది..అడవులు కొట్టేవారు హీరోగా కన్పిస్తున్నారు..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవి పరోక్షంగా తమ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవేనని అభిమానులు మండిపడుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్‌…అడవుల నుంచి సంపదను తరలించే పాత్రను పోషించారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్‌ను ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ అల్లు అర్జున్‌పై నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై నాగబాబుపై అల్లు అర్జున్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా దాడి చేశారు. దీంతో ఆయన ట్విట్టర్‌ ఖాతాను కొన్ని రోజులపాటు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పవన్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలతోనూ అల్లు అర్జున్‌ అభిమానులు మండిపడుతున్నారు. (Story : పవన్‌ కల్యాణ్‌పై పుష్ప అభిమానుల ఆగ్రహం !)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!