ఘనంగా ఆదివాసీ దినోత్సవం
న్యూస్‌తెలుగు/కొమురం భీం : ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా ఆదివాసి గిరిజన నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా మండలాలలో, గ్రామాలలో గిరిజన ఆదివాసి నాయకులు, మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఏకమై భాజా భజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరంకొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు, అనంతరం మహిళలు, యువకులు, విద్యార్థినిలు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు,గిరిజన నాయకులు, మహిళలు, యువకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : ఘనంగా ఆదివాసీ దినోత్సవం)