UA-35385725-1 UA-35385725-1

ఫోన్‌పే నుండి ప్రీ-అప్రూవ్డ్‌ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఫోన్‌పే నుండి ప్రీ-అప్రూవ్డ్‌ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

న్యూస్‌తెలుగు/న్యూఢిల్లీ : ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్‌లో ‘ప్రీ-అప్రూవ్డ్‌ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ ఫీచర్‌ను ఈరోజు తీసుకొచ్చింది. పాలసీ కొనుగోలు సమయంలో ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ అవసరమనే నిబంధనను ఎత్తివేయడం ద్వారా లక్షలాది మంది భారతీయులు ఇన్సూరెన్స్‌ కవరేజీని తేలిగ్గా అందుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా, భారతీయుల్లో చాలా మందికి ఆర్థికంగా సమాన అవకాశాలు కల్పించే కొత్త శకానికి ఫోన్‌పే నాంది పలికింది. సుదీర్ఘంగా, లోతుగా సాగే ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ వెరిఫికేషన్‌ను తొలగించడంతో యూజర్లు ఇప్పుడు వేగంగా, సౌకర్యవంతంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను పొందగలరు. ఈ ఫీచర్‌ను తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడం కోసం ఫోన్‌పే పలు ఇన్సూరెన్స్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల మరింత మంది యూజర్లకు పాలసీలను అందించే అవకాశం కూడా ఇన్సూరెన్స్‌ సంస్థలకు వచ్చింది. మరీ ముఖ్యంగా, దాదాపుగా 3 కోట్ల మంది భారతీయలకు ఇది ఓ వరంగా మారనుంది. (Story : ఫోన్‌పే నుండి ప్రీ-అప్రూవ్డ్‌ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1