స్నాప్ టెస్ట్ ద్వారా సింబియాసిస్ ఎంబీఏ అడ్మిషన్స్
న్యూస్‌తెలుగు/ముంబయి: దేశంలో అగ్రగామి విశ్వవిద్యాలయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంస్థ సింబియాసిస్ యూనివర్శిటీ. ఈ సింబియాసిస్ యూనివర్శిటీ క్రమం తప్పకుండా నిర్వహించే సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (స్నాప్) 2024ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సింబయాసిస్ ఎంబీఏ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిందీ సంస్థ. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 5, 2024 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఇతర ముఖ్యమైన సమాచారం కోసం అధికారిక స్నాప్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పరీక్ష నగరం, పరీక్ష తేదీ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ బేసిస్‌పై అందించబడతాయి. స్నాప్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మూడు విభిన్న తేదీల్లో జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 8, 15, 21 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలు 2025 జనవరి 8న ప్రకటిస్తారు.(Story : స్నాప్ టెస్ట్ ద్వారా సింబియాసిస్ ఎంబీఏ అడ్మిషన్స్)