పైడితల్లమ్మ వారికి సారె సమర్పణ
న్యూస్‌తెలుగు/విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం రైల్వేస్టేషన్ దరి వనంగుడి కి శ్రావణమాసం సందర్బంగా గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్థానిక వసంత్ విహార్ కు చెందిన మహిళా బ్రుందం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుని పసుపుకుంకులు, చీరెలు,పూలు,పండ్లు సారెసమర్పించుకున్నారు ప్రతిఏటా అమ్మవారి కి వసంత్ విహార్ కు చెందిన మహిళలు ఈకార్యక్రమంలో పాల్గనడం ఆనవాయితీ. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న సుదూర ప్రాంత భక్తులంతా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుండే దేవాలయం వద్దకు విచ్చేశారు. (Story : పైడితల్లమ్మ వారికి సారె సమర్పణ )