ఎడ్ల ఆదిరాజు ఆశయాలను కొనసాగించాలి
కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సుంకర సతీష్ కుమార్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : దివంగత ఎడ్ల ఆదిరాజు ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సుంకర సతీష్ కుమార్ అన్నారు. గురువారం దివంగత ఎడ్ల ఆదిరాజు ఐదవ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తో కలిసి ప్రేమ సమాజంలో వృద్ధులకు, అనాధలకు రొట్లు పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నగర అధ్యక్షులు సుంకర సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆయన గడిచిన 30 సంవత్సరాల పైబడి కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు ఎనలేనివన్నారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కొనసాగించాలన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఎడ్ల ఆదిరాజు ఆశయాలను కొనసాగించాలి)