UA-35385725-1 UA-35385725-1

వెలుగు సిసి, ఏపీఎంల అవినీతిపై విచారణ జరిపించండి….?

వెలుగు సిసి, ఏపీఎంల అవినీతిపై విచారణ జరిపించండి..?

ఓ బాధితుడు ఆవేదన

న్యూస్ తెలుగు/చాట్రాయి : మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేయడం.. ప్రశ్నించిన వారిని బ్లాక్ మెయిల్ చేయడం.. కులం పేరు అడ్డం పెట్టుకుని బెదిరించడం… అతనికి పరిపాటిగా మారిందని.. ఆరు నెలల కాలంలో సీసీగా బాధ్యతలు చేపట్టి ఏపీ అండదండలతో అక్రమ పద్ధతిలో లక్షలాది రూపాయల పేదల సొమ్మును దోచుకుంటున్న సీసీ పై ఏపీఎంపై విచారణ జరిపించాలని తుమ్మ గూడెం మదర్ తెరిసా గ్రామైక్య సంఘం బుక్ కీపర్ మలుగుమాటి సురేష్ డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఆయన న్యూస్ తెలుగు తో మాట్లాడుతూ. తన గోడు వెళ్ళబుచుకున్నారు. మండలంలోని తుమ్మగూడెం గ్రామంలో మదర్ తెరిస్సా గ్రామైఖ్య సంఘానికి 2016వ సంవత్సరం నుంచి బుక్ కీపర్ గా పనిచేస్తున్నానని భార్య భర్తలు ఇద్దరం వికలాంగులు మేనని బుక్ కీపర్ గానే జీవనం కొనసాగిస్తున్నానని అన్నారు. అయితే ఆగస్టు నెలలో ముసునూరు మండలం నుండి బదిలీపై సిసిగా బాధ్యతలు లోకి వచ్చిన మారే శ్వరరావు తనకు మాయమాటలు చెప్పి …. పూర్తిగా నమ్మించి … నువ్వు నేను ఇద్దరం వికలాంగులమే నిన్ను నేను పైకి తీసుకు వస్తాను . నన్ను నమ్ము నిన్ను ఆర్థికంగా బలపరిచే బాధ్యత నాది అంటూ నమ్మబలకడంతో అతని మాటలు పూర్తిగా నమ్మిన నేను అతను ఏం చెబితే తాను అది చేశానని తెలిపారు. తీర్మానం పుస్తకాలు రెండు పెట్టించారని అన్నారు. పొద్దున్నే బ్యాంకులో డబ్బులు డ్రా చేయించి నాకు కేవలం 2000 మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు మొత్తం తను తీసుకువెళ్లి పోయే వారని ఆ విధంగా చాలా సందర్భాల్లో చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో డబ్బులు ఎక్కువసార్లు ఎలా డ్రా చేయాలో తనకు తెలియక పోయినా ప్రణాళిక బద్దంగా నాతో ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేయించి సాయంత్రం వచ్చి మొత్తం డబ్బులు పట్టుకు వెళ్ళిపోయేవారు అని అన్నారు. విషయం బయటపడిన తరువాత ఏపీఎంఓ వాస్తవాన్ని నిలదీయాల్సింది పోయి సీసీకి మద్దతుగా నిలవడం మొదలు పెట్టారని అన్నారు. మే నెల ఎండల్లో నా తీర్మానం పుస్తకాలు మొత్తం ఇవ్వాలని నేను ఆఫీసు బయట మండుటెండల్లో కూర్చుంటే వేరే వారు వచ్చి తనను బ్రతిమాలి లోపలికి తీసుకు వెళ్లారని అన్నారు. విచారణలో మొత్తం డబ్బు నేను తినేసినట్లు సృష్టించారని నాతో మూడు లక్షల 50 వేల రూపాయల కట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అత్త వారు మా ఆవిడకు ఇచ్చిన పొలం అమ్మి కట్టానని ఆవేదన వ్యక్తం చేశారు.3 లక్షల పదివేల రూపాయలు నా ద్వారా అక్రమంగా తినేసి ఇప్పుడు సిసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.సిసి తప్పును ఎవరైనా ప్రశ్నిస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నారని నేను గిరిజనుడని బెదిరిస్తున్నారని ఇతను పనిచేసిన విస్సన్నపేట మండలం ముసునూరు మండలాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని తెలిసిందన్నారు. గ్రామైక్య సంఘానికి సంబంధించిన తీర్మానం పుస్తకాలు విచారణ పేరుతో తీసుకువెళ్లి ఏం చేశారో కూడా తెలియడం లేదు అన్నారు. డబ్బులు మార్చడానికి సిసి రాసిన రెండవ తీర్మానం పుస్తకం బయట ఎందుకు పెట్టడం లేదన్నారు. తీర్మానం పుస్తకాలను ఆఫీసులో కాకుండా సిసి ఇంటికి తీసుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు….? కనీసం ఈ మాట కూడా ఎవరు అడగడం లేదన్నారు. ఏపీఎం బలంగా అతనికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. మారేశ్వరావుకు కనీసం పని పట్ల అవగాహన లేదన్నారు . ఆయన చేయాల్సిన పని కూడా ఆయనకు తెలియదు అన్నారు.మహిళా సంఘాలు అప్పు తీసుకోవడానికి తీర్మానం పుస్తకంపై సంతకాలు పెట్టాలంటే పైసలు కట్టండి సంతకాలు పెట్టడం లేదని అనేకమంది బాధపడుతున్నారని అన్నారు. తాను ఇప్పటికే స్పందనలో కూడా ఫిర్యాదు చేసి రెండు వారాలు అవుతుందన్నారు. అవినీతికి పాల్పడుతున్న సిసి ఏపీఎంలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. (Story : వెలుగు సిసి, ఏపీఎంల అవినీతిపై విచారణ జరిపించండి….?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1