భవన నిర్మాణానికి అనుమతులు తప్పనిసరి
ఎం ఎం నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రతి భవన నిర్మాణానికి అనుమతులు తప్పనిసరని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని 26వ డివిజన్ కోరాడ వీధి, ఎలుగుబంటి వారి వీధి తదితర ప్రాంతాలలో పర్యటించి, అన్ని అంశాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనాలకు అనుమతులు ఉన్నాయా లేదా అని సంబంధిత కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఖాళీ స్థలాలకు పన్ను విధింపు చేపట్టారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిరుపయోగంగా పడి ఉన్న పాత్రలలో వర్షపు నీరు చేరి నిల్వ ఉండడానికి గమనించి సంబంధిత పారిశుధ్య కార్మికులను, కార్యదర్శులను మందలించారు. ఏ ప్రాంతంలోనైనా నీరు నిల్వ ఉండకుండా చూడవలసిన బాధ్యత సంబందిత కార్యదర్శులపై ఉందని అన్నారు. అలాగే ప్రజలలో కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిర్మాణానికి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులచే అనుమతులు తప్పనిసరని అన్నారు. ఖాళీ స్థలాలలో చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సంబంధిత యజమానులకు సూచిస్తున్నామన్నారు. దీనివల్ల చెత్త చెదారాలు పేరుకుపోయి చుట్టుపక్కల ప్రాంతాలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి దోమలు వృద్ధి లేకుండా చూడాలన్నారు (Story : భవన నిర్మాణానికి అనుమతులు తప్పనిసరి )