క్లారిటీ సిరీస్‌ను లాంచ్ చేసిన బౌల్ట్
న్యూస్‌తెలుగు/న్యూఢిల్లీ : భారతదేశంలో నెంబర్ వన్ రేటెడ్ ఆడియో బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ బౌల్ట్. ఇప్పటికే ఎన్నో అద్బుతమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించిన బౌల్ట్… ఆడియో టెక్నాలజీలో అందరికంటే ముందంజలో ఉంది. దీంతో ఇప్పుడు మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమైన బౌల్ట్… తాజాగా టైలర్ మేడ్ టీడబ్ల్యూఎస్ క్లారిటీ 1, 3ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ ద్వారా డిజైన్ మరియు ఆడియో టెక్నాలజీలో సరికొత్త బెంచ్ మార్క్‌ని సెట్ చేయాలని భావిస్తోంది. ఈ క్లారిటీ సిరీస్.. లగ్జరీ, ఫంక్షనాలిటీ, ఐకానిక్ డిజైన్‌ల ఖచ్చితమైన సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఆడియో ఎక్సలెన్స్‌లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందని బౌల్ట్ భావిస్తోంది. తాజాగా లాంచ్ అయినటువంటి క్లారిటీ 3 నిజమైన వైర్ లెస్ ఇయర్‌బడ్‌లు. ఇవి అత్యాధునిక ఫీచర్‌లతో మీ ఆడియో ఎక్స్ పీరియన్స్‌ను విప్లవాత్మకంగా మార్చేందుకు సెట్ చేయబడ్డాయి. 50 డెసిబుల్స్ వరకు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, క్రిస్టల్-క్లియర్ కాల్‌ల కోసం 6 అధునాతన మైక్రోఫోన్‌లు వీటి ప్రత్యేకత. అంతేకాకుండా బౌల్ట్ ఏఎంపీ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేని యాప్ కనెక్టివిటీని అందిస్తాయి. (Story : క్లారిటీ సిరీస్‌ను లాంచ్ చేసిన బౌల్ట్)