UA-35385725-1 UA-35385725-1

పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా..

పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా..

ప్ర‌మోష‌న్స్‌లో జోరు చూపిస్తోన్న చిత్ర యూనిట్‌..

ఆగ‌స్ట్ 9న భారీ ఎత్తున సినిమా విడుద‌ల‌

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని అధినేత‌, ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో సినీ రంగానికి చెందిన‌వారు కూడా పిఠాపురం వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్క‌డ నిర్వ‌హిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గానికి మెగా డాట‌ర్ వెళ్ల‌టం హాట్ టాపిక్‌గా మారింది.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆగ‌స్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోషన్స్‌లో వేగం పెంచారు. అందులో భాగంగా పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ నుంచి వైజాగ్ ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డ సందడి చేసింది. అందులో భాగంగా పిఠాపురంకు చిత్ర యూనిట్ వెళ్లింది. అక్క‌డ‌  కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది.

ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మంచి డైలాగ్స్‌తో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రూపొందింది. మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్‌, సాంగ్స్ చూస్తుంటే మ‌న స‌మాజంలో జ‌రిగే నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా, మ‌నం మ‌న స్నేహితుల‌తో ఎలా ఉంటామో అలాంటి స‌న్నివేశాల‌ను పొందుప‌రుస్తూ సినిమాను రూపొందించార‌ని స్పష్ట‌మ‌వుతుంది. స్నేహం గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జెప్పేలా ఉండే ఈ సినిమాను చూడాల‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఏర్ప‌డింది. దీంతో ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. సోమ‌వారం హైద‌రాబాద్‌లో క‌మిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్,  ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌:  సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌:  శివ‌, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వి మీడియా, మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ,  పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి). (Story : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1