నిత్య అన్నదానం కార్యక్రమం ప్రారంభం
న్యూస్‌తెలుగు/విజయనగరం:శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ను ఆలయ ధర్మకర్త పాకలపాటి సన్యాసి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ని శంకరమఠం సమీపంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తులు చే విశేషంగా పూజలు అందుకుంటుందన్నారు. గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఆలయం ప్రాంగణంలో నూతనంగా గత ఏడాది నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూల విరాట్ స్వామి వారి ని తిరుపతి నుండి తీసుకుని వచ్చి ఆగమోక్తమంగా ప్రతిష్ట చేశారన్నారు. గురువారం ఆషాఢ శుద్ధ ద్వాదశి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదానం కార్యక్రమం శ్రీ కారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త పాకలపాటి సన్యాసి రాజు దంపతులు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.. ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు… ప్రతీరోజూ ఆలయం లో స్వామి వారికి నిత్య పూజలు విశేషంగా పర్వ దినాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. (Story : నిత్య అన్నదానం కార్యక్రమం ప్రారంభం )