పేదల పక్షపాతి చంద్రబాబు
మోరంపూడి శ్రీనివాసరావు
న్యూస్ తెలుగు/ చాట్రాయి : పేదల జీవితాల్లో ఆర్దిక వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలు మరువలేనివని తెలుగురైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు కొనియాడారు.గురువారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఎన్టీఆర్ పించన్ పంపిణి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హజరైయ్యారు.పేదల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్య పరిస్తితులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో జ్వరాలు నొప్పులు తీవ్రంగా వున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆరోగ్య శిబిరంలో వైద్యసేవలు ఉపయోగించు కోవలన్నారు.ఆరోగ్య పరిస్తితులపట్ల నిర్లక్ష్యం వద్దు అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి కందుల కృష్ణ జక్కంపూడి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story : పేదల పక్షపాతి చంద్రబాబు )