ఈవెంట్ పరిశ్రమ ఎదుగుదలకు కృషి
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: ఈవెంట్ పరిశ్రమ ఎదుగుదలకు శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆళ్ల బలరాం బాబు తెలిపారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొలువుదీరిన సందర్భంగా హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ 6వ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో పరిశ్రమగా ఎదుగుదలను కొనసాగిద్దామన్నారు. తెలంగాణా ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ అసోసియేషన్ పరిధిలో వివిధ సంఘాల ఎన్నికలు ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు జరిగాయన్నారు. ఈ ఎన్నికలలో నెగ్గిన కార్యవర్గాలు రెండేళ్ల పాటు కొనసాగుతాయని చెప్పారు. (Story : ఈవెంట్ పరిశ్రమ ఎదుగుదలకు కృషి)