పైడితల్లమ్మకు సారె సమర్పణ
న్యూస్‌తెలుగు/విజయనగరం:ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ వారికి మంగళవారం ఉదయం పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలతో అలంకరణ చేశారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఉదయం నుండే విచ్చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.అనంతరం మధ్యాహ్నం దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ డి వి వి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సుమారు 1,000 మంది మహిళలతో కోట వద్ద నుండి పైడితల్లమ్మ వారి దేవాలయం వరకు విశేష కోలాటాలు సంబరాల మధ్య పైడితల్లి అమ్మకు సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయం వద్ద మంచినీరు ,మజ్జిగ పంపిణీ , ప్రసాదం వితరణ తో పాటు ప్రతిరోజు వలె అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు అర్చకులు ఏడిద వెంకటరమణ పూజలు నిర్వహించారు. దేవాలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీనియర్ అసిస్టెంట్ లు ఏడుకొండలు, మణికంఠ తో పాటు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. (Story : పైడితల్లమ్మకు సారె సమర్పణ)