UA-35385725-1 UA-35385725-1

కలెక్టర్ తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ

కలెక్టర్ తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ

గతంలో మంజూరు అయిన పెండింగ్  పనులు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి

సాగునీటి కోసం చేసిన ప్రతిపాదనలు యధావిధిగా చేపట్టాలి.

న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీమంత్రి నిరంజన్ రెడ్డి బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిదులతో కలసి నియోజకవర్గంలో వివిధ మండలాలలో జిల్లా కేంద్రములో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నిధులు మంజూరి ఉండి ఆగిపోయాయని ఇట్టి పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతుల విస్తృత ప్రయోజనాలకోసం చేపట్టినసాగునీటి సంబంధించి పెండింగ్ పనులు ఎటువంటి మార్పులు లేకుండా యధావిధిగా చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు. గణపూర్ మరియు బుద్దారం చెరువులను ప్రత్యేక జి.ఓ ద్వారా 3500నుండి 5000వేల ఆయకట్టుకు ఉపయోగపడే విధంగా ప్రతిపాదనలు చేసి పనులు చేపట్టడం జరిగింది.నేటి ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు దాన్ని వల్ల వేలాది రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గత ప్రతిపాదనల ప్రకారమే నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. మామిడిమాడ రిజర్వాయర్ పూర్తి చేయాలి అని విజ్ఞప్తి చేశారు. కర్నే తాండా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతిపాదించిన విధంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 50కోట్లతో చేపట్టే రామన్నగుట్ట రిజర్వాయర్(D 8. M.J 4) కాశీమ్ నగర్, రేమోద్దుల,అంజనగిరి పరిధిలో పనులకు టెండర్ పిలవాలని విజ్ఞప్తి చేశారు. బుర్రవాగు చెక్ డ్యాం నందు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు. నాగవరం,రాజానగరం పరిధిలో ఉన్న భూములపై దేవాదాయ శాఖ నిషేధిత జి.ఓ ఎత్తివేయాలని కోరారు. సవాయిగుడెం,నాచనహళ్లి మధ్యలో ఉన్న జమ్ముల తాండకు అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయాలని , కె.ఎల్. ఐ కెనాల్స్ ద్వారా నీళ్ళు వెంటనే విడుదల చేయించేవిధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. J.N.T.U ఇంజనీరింగ్ కాలేజీ కోసం 5కోట్లు మొదటివిడత,రెండో విడత 32కోట్లు మంజూరి వున్నాయి వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి. జిల్లా కేంద్రంలో బైపాసు రోడ్ పనులు ప్రారంభించాలి. అగ్రికల్చర్ కాలేజీ ఒక కోటి 50లక్షలు మంజూరు ఉన్నాయి వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి.
వనపర్తి పెబ్బేరు రోడ్ 9కి.మీ ప్రారంభించాలి.
పాలిటెక్నిక్,నూతన హాస్టల్స్,ప్యాలెస్ ఆధునీకరణ
చిట్యాల, పీర్లగుట్ట డబల్ బెడ్ రూమ్స్ దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి. ఎస్.టి సబ్ ప్లాన్ రోడ్స్ పూర్తి చేయాలని విజ్ఞప్తి.
అసంపూర్తిగా ఉన్న రోడ్ విస్తరణ పాలిటెక్నిక్ నుండి రామాలయం వరకు చేపట్టాలి. S.D.F నిధులలో 5కోట్లు మాత్రమే ఖర్చు జరిగింది మిగతా 15కోట్లు నిధులు పనుల కోసం ప్రారంభించాలని.
పెబ్బేరు స్టేడియం పనులు ప్రారంభించాలని. టౌన్ హాల్ మిగతా పనులు పూర్తిచేసి ప్రారంభించాలని ,
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెసైడ్ మార్కెట్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని. 33/11K.V మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి.
డ్రైనేజీలు,పోల్స్ పెబ్బేరు పట్టణంలో మార్చాలి.
రోడ్లవిస్తరణలో ఇళ్ళు కోల్పోయిన వారికి ప్లాట్లు కేటాయించాలి.
పెబ్బేరు నందు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి.
అమృత్ సంబంధిత పనులు ప్రారంభించాలని .
పై అభివృద్ధి పనులు గూర్చి వివరించారు.
ప్రజాప్రతినిధులు తమ సమస్యలన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు.సావధానంగా విన్న కలెక్టర్ గారు గతములో ప్రారంభం అయిన పనుల పట్ల పూర్తి అవగాహన ఉన్నందున పెండింగ్ పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గట్టు యాదవ్, గ్రంధాలయ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య,మాజీ Z.P.T.Cలు సామ్యనాయక్, రఘుపత్తిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎద్దుల.కరుణశ్రీ,వైస్ చైర్మన్ కర్రేస్వామి,మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్మారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి,జగన్నాథం నాయుడు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాజీ ఎం.పి.పి సేనాపతి, తిరుపతయ్య,పృథ్వి రాజ్,రైతు సమితి నాయకులు గౌడ నాయక్, డెవర్ల.నరసింహ, చంద్రశేఖర్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం,రాళ్ళ.కృష్ణయ్య,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, సయ్యద్.జమేల్,సూర్యవంశపు.గిరి, జోహేబ్ హుస్సేన్,చిట్యాల.రాము, ముద్దుసర్,పాల్గొన్నారు. (Story : కలెక్టర్ తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1