అల్లు అర్జున్ ఇప్పుడు టీడీపీ నా?
అల్లు అర్జున్ ఇటీవల ఎన్నికల్లో తన స్నేహితుడు శిల్ప రవి రెడ్డికి సపోర్ట్ గా నంద్యాల వెళ్లి ప్రచారం చేసారు. దీన్ని జీర్ణించుకోలేని మెగా ఫాన్స్ , నాగబాబు పెద్ద ఎత్తున్న ట్రోల్ చేసారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్న వెళ్లి సపోర్ట్ చేస్తానని ఖరాకండిగా చెప్పారు. ఫాన్స్ మాత్రం అల్లు అర్జున్ వైసీపీ పార్టీ మనిషి అని ముద్ర వేశారు. తాజాగా అల్లు అర్జున్ తన మిత్రుడు అయినా టీడీపీ MLA అష్మిత్ రెడ్డి గెలిచిన సందర్బంగా వెళ్లి విషెస్ తెలిపి, పార్టీ లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.