పెత్తందారుల ఆటలు ఇకసాగవు!
మీ సమస్యపరిష్కారం అయ్యేంతవరకు అక్కడే కూర్చోండి : మంత్రి పార్థసారథి
న్యూస్ తెలుగు/చాట్రాయి: అలీ సాహెబ్ అంటే ఎవరు….? నీ ఉద్వోగం ఏంటి ?….నువ్వు చేసేది ఏంటి……? అందరినీ వాసు రాఘవరెడ్డి గారి దగ్గరికి పంపిస్తున్నావా….? మోతాదు… బిళ్ళా బంట్రోతు …..వీఆర్వో తాసిల్దార్…. అన్ని ఉద్యోగాల నీవేనా…. పెత్తందారుల ఆటలు ఇక సాగవు …. బ్రోక రేజీలు పనిచేయవు … సమస్యలు పరిష్కారం కావాల్సిందే… పరిష్కారం అయ్యేంతవరకు మీరు అక్కడే కూర్చోండి అంటూ మంత్రి బాధితులను హెచ్చరించడంతో అందరూ కంగు తిన్నారు. ఆదివారం మధ్యాహ్నం చాట్రాయి మండలం పోతనపల్లి పంచాయతీ మంకొల్లు గ్రామంలో ఒక చెట్టు కింద ప్రజలతో అధికారులతో ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు. మంత్రి సారధి పేదల ప్రజల పక్షాన నిలబడ్డారు. అధికారులను నిలదీశారు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోతాదు దగ్గర మొదలు పెట్టి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎవరిని వదలలేదు. ప్రతీ సమస్యకూ పరిష్కారం అడిగారు. అసైన్మెంట్ భూములు ఆన్లైన్ సమస్యను పేదలు మంత్రికి వివరిస్తూ మా సమస్య అలీ సాహిబ్ గారికి మొత్తం తెలుసని తరబడి కాళ్ల అరికెల తిరుగుతున్నామని వారు మంత్రికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన సారధి అలీ సాహెబ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నీ ఉద్వోగం ఏంటి నువ్వు చేసేది ఏంటి అంటూ ప్రశ్నించడంతో తహశీల్దార్ ఏదో చెప్పే ప్రయత్నం చేయగా మంత్రి తీవ్రంగా స్పందిస్తూ అవునండి మీరు ఒక్కొక్క ప్రాంతానికి ఎలాంటి బ్రోకర్లను పెట్టుకుంటారు మాలాంటోళ్లేమో నాయకులు చెప్పు చేతల్లో ఉండాలి. మీ మోతాదు చేసే పని నాకు తెలుసు రాఘవ రెడ్డి గారి దగ్గరికి వాసు దగ్గరికి అందర్నీ పంపించడమే గా ఈయన చేసే పని సమస్యలు పరిష్కారం కావాల్సిందే పెత్తందారుల ఆటలు ఇక సాగవు అంటూ హెచ్చరించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వ కార్యలయంలో సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చే వరకూ అధికారి ముందే కూర్చోండి అంటూ హెచ్చరించారు. మత్స్య శాఖ అధికారులపై మాట్లాడుతూ. తమ్మిలేర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలో చేపలు పట్టుకోవడానికి ఎంతమందికి లైస్సెన్స్ ఇచ్చారు….? ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది…? అని ప్రశ్నించగా అధికారి చింతలపూడి చింతలపూడి అంటుండడంతో చింతలపూడి గురించి కలవరిస్తున్నారు నూజివీడు కనపడదా..? ప్రాజెక్టులో ఎక్కువ భూభాగం ఎవరిది అంటూ ప్రశ్నించారు. సమస్య వెంటనే పరిష్కారం కావాలన్నారు. అదేవిధంగా ప్రతి చిన్న సమస్య పైన సమస్య లోతులను తెలుసుకొని పరిష్కారం దిశగా ఆలోచింపజేశారు. ప్రతి సమస్య పైన స్పందించారు సమస్యల పరిష్కారం పైనే సారధి ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే పేదల పెద్ద పాలేరుగా పనిచేస్తానని పేదవారికి భరోసా ఇచ్చారు అదే విధంగా ఈరోజు పేదల పక్షాన నిలబడటం చర్చనీయాశం అయింది. (Story: పెత్తందారుల ఆటలు ఇకసాగవు!)