తెలంగాణ విదత్సభ అష్టమవార్షిక విద్వత్ సమ్మేళనం
న్యూస్‌తెలుగు/వనపర్తి: తెలంగాణ లోని యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నృసింహ వేద విద్యాలయంలో తెలంగాణ విదత్సభ అష్టమవార్షిక విద్వత్ సమ్మేళనం జూలై 27, 28 వ తేదీలలో జరిగింది. ఈ సమ్మేళనంలో రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర(2025-26) పండుగలు నిర్ణయించడం జరిగినది. దాదాపుగా 45 సంవత్సరాల నుండి పంచాంగ గణనం చేస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాకే కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి, ముహూర్త విషయాలలో అలాగే ఇతర కార్యక్రమాలలో సేవలందించిన గొప్ప వ్యక్తి మనోహర్ శర్మ సిద్ధాంతి పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి పుష్పగిరి పీఠ మహాసంస్థాన జ్యోతిష విద్వాంసులు అయిన బ్రహ్మశ్రీ ఓరుగంటి మనోహర్ శర్మ సిద్ధాంతిని, వారి సతీమణి వసుంధర దేవిని ఘనంగా సత్కరించారు. (Story: తెలంగాణ విదత్సభ అష్టమవార్షిక విద్వత్ సమ్మేళనం)