Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు

సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు

0

సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు

న్యూస్‌తెలుగు/ తిరుప‌తి : శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి

తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.

రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్ లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఇ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version