జోరుగా పెరిగిన మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్ డీలర్‌షిప్‌లు
న్యూస్‌తెలుగు/పుణె: సీఏజీఆర్ ప్రాతిపదికన 2024 ఆర్థిక సంవత్సరంలో 46 శాతం వ్యాపార పరిమాణం పెరుగుదలతో నాలుగేళ్ల పటిష్ట వృద్ధి సాధించిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) జూలై నెలలో భారత్‌లో నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా అయిదు అధునాతన డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. వీటిలో రోజుకు 75 పైగా వాహనాలకు సర్వీసులు అందించేలా 37 సర్వీస్ బేలు ఉన్నాయి. అలాగే ఇవి డ్రైవర్ లాడ్జింగ్, 24-గంటల బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, యాడ్‌బ్లూ మొదలైనవి కూడా అందించగలవు. మహీంద్రా అండ్ మహీంద్రా బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) జలజ్ గుప్తా మాట్లాడుతూ, భారతీయ సీవీ మార్కెట్లో ఎంటీబీడీకి పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నాయని, సంస్థ ఇప్పటికే పలు రంగాలు, మార్కెట్లలో 3వ స్థానంలో ఉందన్నారు. కొత్తగా ఈ 5 డీలర్‌షిప్‌లు తోడు కావడమనేది నెట్‌వర్క్‌ను మరింత పెంచగలదని, మా కస్టమర్ల వాహనాల సర్వీసింగ్‌కు, వారు తమ ఫ్లీట్‌లను మరింత సమర్ధంగా పనిచేయడంలో తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలవని విశ్వసిస్తున్నామన్నారు. (Story : జోరుగా పెరిగిన మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్ డీలర్‌షిప్‌లు)