‘HIT: The 3rd Case’ షూటింగ్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుంది.