ఆచార్య రాజ్యలక్ష్మిని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున అభినందన
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : ఇటీవల జేఎన్టీయూ గురజాడ విజయనగరం ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ఆచార్య డి రాజ్యలక్ష్మి ని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర సాంకేతిక విద్యా ప్రదాయని అయిన జెఎన్టియు ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు పరిశోధకులు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ లో జరిగిన అవినీతి అక్రమ నియామకాలు విషయంలో విచారణ చేసి మరల అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పరిపాలన , అక్రమ నియామకాల పట్ల ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, ఒకవైపు మాజీ విసి వెంకటసుబ్బయ్య చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతూనే ఉంటుందని, మీరు మాత్రం విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచే విధంగా తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని ఆయన కోరారు . (Story : ఆచార్య రాజ్యలక్ష్మిని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున అభినందన)