నూతన విసిగా భాద్యతలు చేపట్టిన ప్రొఫెసర్ గంగాధర రావు
న్యూస్‌తెలుగు/గుంటూరుః ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నూతన ఇన్ చార్జి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర రావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో వైస్ ఛాన్సలర్ గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుకి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కికృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించి, యూనివర్సిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. యూనివర్సిటీ లోని అందరి అధికారుల, ఉద్యోగుల, అధ్యాపకుల సహకారంతో యూనివర్సిటీ అభివృద్ధి ని రెట్టింపు చేస్తానని పేర్కొన్నారు. విద్యా విషయక , పరిశోధన, బోధన రంగాలను బలోపేతం చేసి యూనివర్సిటీ స్థాయిని పెంచేందుకు కృషి చేస్తానన్నారు.
అభినందనల వెల్లువ.
నూతన ఇన్చార్జి వైస్ ఛాన్స లర్ ప్రొఫెసర్ గంగాధర్ రావుకు అభినందనల వెల్లువ కురిసింది. ఉదయం నుంచి విశ్వవిద్యాలయ తాత్కాలిక రిజిస్ట్రార్ సంధ్యకోల్, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ స్వరూప రాణి, ప్రొఫెసర్ సిద్దయ్య, ప్రొఫెసర్ జాన్సన్, ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్ ప్రమీలరాణి, ఓ ఎస్ డి ప్రొఫెసర్ కె. సునీత, మాజీ రెక్టార్ ప్రొఫెసర్ పి. వరప్రసాద్ మూర్తి, మాజీ రిజిస్ట్రార్ బి. కరుణ లతో పాటు విభాగాధిపతులు, కోఆర్డినేటర్లు, అధ్యాపకులు వి .వెంకటేశ్వర్లు , అశోక్ కుమార్, ఏవివీఎస్ స్వామి, ఎన్వి కృష్ణారావు, జి. సింహాచలం, పిపిఎస్ పాల్ కుమార్, సుమంత్ కుమార్, మల్లికార్జున, జగదీష్ నాయక్, పీవీ కృష్ణ, చెన్నారెడ్డి, సోమశేఖర్, ఉదయ్ కుమార్, ఏసీఈ రెడ్డి ప్రకాష్ రావు, వికాస అధ్యక్ష కార్యదర్శులు టి. అనిల్ కుమార్, కావూరి శ్రీనివాసరావు, దినసరి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. రాము, కోశాధికారి తెరిసా బాబు, కార్యవర్గ సభ్యులు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శాంతి శ్రీ, ఎం ఎం ఆర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు విశ్వవిద్యాలయంలోని మహోన్నతుల విగ్రహాలకు పూలమాలలు వేయనున్నారు. (Story : నూతన విసిగా భాద్యతలు చేపట్టిన ప్రొఫెసర్ గంగాధర రావు)