యుఏఈ వ్యాపారంపై అసోచామ్ బి2బి సమావేశాలు
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: షార్జా, యూఏఈ ప్రభుత్వం సహకారంతో, ‘‘యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం’’ అనే అంశంపై ప్రత్యేకమైన బి2బి సమావేశాలను తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతుతో నిర్వహించనున్నట్టు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్ ) ప్రకటించింది. ఈ సమావేశాలు 2024 జూలై 22, 23 తేదీలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు హోటల్ ఐటిసి కాకతీయ, 6-3-1187, బేగంపేట్, హైదరాబాద్ -500016 వద్ద జరుగుతాయి. వ్యాపార ప్రోత్సాహకాలు, సున్నా పన్నులు, వేగంగా కంపెనీ రిజిస్ట్రేషన్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, రష్యా, యూరప్‌లో వ్యూహాత్మక మార్కెట్ లను చేరుకోవడంతో సహా, యూఏఈలో వ్యాపార కార్యకలాపాల ప్రారంభించే అవకాశాలు, ప్రయోజనాలను గురించి భారతీయ వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించటం ఈ సమావేశాల లక్ష్యమని అసోచామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి రవి కుమార్ రెడ్డి కటారు తెలిపారు. (Story : యుఏఈ వ్యాపారంపై అసోచామ్ బి2బి సమావేశాలు)