విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టిన ‘నారాయణ’
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: 40 ఏళ్ళ సుధీర్ఘ విద్యా ప్రస్థానంలో లక్షలాది విద్యార్థుల కలలను సాకారం చేసిన నారాయణ, ఇప్పుడు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. కేవలం చదువే కాకుండా విద్యార్థులకు ఎదురయ్యే మానసిక సమస్యలను సమర్థవంతంగా అధిగమించేలా చర్యలు చేపట్టింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా నడచుకోవాలి ? వారి మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలపై నిపుణులచే లోతుగా చర్చించి అవసరమైన సలహాలు, సూచనలతో యూట్యూబ్ వేదికగా మొదటి సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌ను గైడ్‌కాస్ట్ పేరుతో రిలీజ్ చేసింది నారాయణ. దీనిలో భాగంగా విద్యార్థుల మానసిక స్థితి, దానిపై ప్రభావం చూపే అంశాల గురించి లోతుగా చర్చించి వాటిని అధిగమించేందుకు విలువైన సలహాలు, సూచనలు అందించడం జరిగింది. అంతే కాకుండా విద్యార్థి రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై నిపుణుల సూచనలు అందించడం జరిగింది. (Story : విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టిన ‘నారాయణ’)