Home సినిమా ఓటీటీ బిగ్‌ బాస్‌ ఓటీటీ 3లో నోరు జారిన లవ్‌కేష్‌

బిగ్‌ బాస్‌ ఓటీటీ 3లో నోరు జారిన లవ్‌కేష్‌

0

బిగ్‌ బాస్‌ ఓటీటీ 3లో నోరు జారిన లవ్‌కేష్‌

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: బిగ్‌ బాస్‌ ఓటీటీ 3లో లవ్‌కేష్‌ కటారియా నోరు జారారు. సాయి కేతన్‌ రావు తల్లిపై దుర్భాషలాడారు. ఇది తట్టుకోలేక సాయి కేతన్‌ రావు కోపానికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా హౌస్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రీసెంట్‌ ఎపిసోడ్‌లో ఒక రొటీన్‌ టాస్క్‌లో ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇది వీక్షకులు, అభిమానుల మధ్య తీవ్రమైన చర్చకు దారితీసింది. సాయి కేతన్‌ రావు తల్లిని ఉద్దేశించి లవకేష్‌ కటారియా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించడం లేదు. అవమానకర వ్యాఖ్యలతో సాయి కేతన్‌ రావు కదిలిపోయారు. కుటుంబంతో ముఖ్యంగా తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని ఇది వెల్లడి చేసింది. ఆయన ప్రతిచర్య వ్యక్తిగత బాధను మాత్రమే కాకుండా.. తన ప్రియమైన వారి పట్ల తనకున్న ప్రేమను తెలియజేసింది. ఒక టాస్క్‌ మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. లవ్‌కేష చేసిన తప్పు బిగ్‌ బాస్‌ హౌస్‌లోనూ సోషల్‌ మీడియా వేదికపైనా విమర్శకులకు గురయ్యింది. లవ్‌కేష ప్రవర్తన పట్ల వీక్షకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇటువంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. (Story : బిగ్‌ బాస్‌ ఓటీటీ 3లో నోరు జారిన లవ్‌కేష్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version