శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్‌కామ్ హాస్పిటాలిటీ వసతి సేవలు
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: విమానాశ్రయ ఆతిథ్యంను పునర్నిర్వచించడంలో ప్రసిద్ధి చెందిన ఎన్‌కామ్ హాస్పిటాలిటీ, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ మొదటి ట్రాన్సిట్ లాంజ్‌ను వైభవంగా ప్రారంభించింది. సముచితంగా ‘ట్రాన్సిట్ బై ఎన్‌కామ్‘ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన లాంజ్ ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చనుంది, ప్రయాణ సమయంలో అత్యుత్తమ సౌకర్యం, సౌలభ్యం కోసం 57 నిశితంగా రూపొందించబడిన గదులను అందిస్తుంది. విమానాశ్రయంలో లెవల్ డీ అరైవల్స్ వద్ద ఉన్న ఈ ట్రాన్సిట్ లాంజ్, ఐకానిక్ చార్మినార్ నుండి కేవలం 40 నిమిషాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక గంట మరియు మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి 45 నిమిషాల దూరంలో, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించటానికి వ్యూహాత్మకంగా ఉంచబడిరది. ‘ట్రాన్సిట్ బై ఎన్‌కామ్ ‘ అనేది కేవలం స్టాప్ ఓవర్ కంటే ఎక్కువ. ఇది ప్రతి ప్రయాణికుడి విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన అద్భుతం. ఈ లాంజ్‌లో 57 గదులు, సూట్‌లు ఉంటాయి. 17 చదరపు మీటర్ల నుండి విశాలమైన 51 చదరపు మీటర్ల వరకు పరిమాణంలో ఇవి ఉంటాయి. (Story : శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్‌కామ్ హాస్పిటాలిటీ వసతి సేవలు)