సంసిద్ధత కంటే మించినది సంకల్పం: నీరజ్ చోప్రా
న్యూస్‌తెలుగు/ ముంబయి: నీరజ్ చోప్రా నమ్మే ధైర్యం, పోరాటపటిమ, దృఢసంకల్పం, మొండి పట్టుదల అండర్ ఆర్మర్ ప్రచారానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. దేశానికి మరింత కీర్తి తీసుకువచ్చేందుకు లక్ష్యసాధనలో వెనక్కి తగ్గరాదనే ఈ ఒలింపిక్ విజేత, ప్రపంచ ఛాంపియన్ పట్టుదలతో కూడిన మనస్తత్వాన్ని ‘మరింత పట్టుదలగా’ అనే ఈ ప్రచారం లోతుగా తెలియజెప్తుంది. విస్మయపరిచే ఈ ప్రచారం కోసం గంటలకొద్ది చోప్రా కఠినమైన శిక్షణ తరగతులను రోజుల కొద్ది షూట్ చేస్తూ రూపొందించడం జరిగింది. ‘సంసిద్ధత కంటే మించినది సంకల్పం’ అని మాటలతో ఈ చిత్రం ఒపెన్ అవుతుంది. ఈ మాటలను చోప్రా వ్యక్తిగతంగా నమ్మడమే కాదు తన కఠోర శిక్షణలో ఎదురయ్యే అలసట, గాయాలు, విదేశాల్లో ఒంటరితనంతో చేసే పోరాటంలో వ్యక్తం చేస్తూ ఉంటారు. ‘‘మా బ్రాండ్ ముఖ్య విలువలైన ధైర్యం, పోరాటపటిమ, దృఢనిశ్చయానికి నిలువెత్తు రూపంగా, నేటి తరానికి ఐకాన్‌గా నిలుస్తున్న భారతదేశపు గొప్ప అథ్లెట్స్‌లో ఒకరైన నీరజ్‌తో దీర్ఘకాలిక అనుబంధం కొనసాగిస్తుండటం మాకు చాలా గర్వంగా ఉంది’ అని అండర్‌డాగ్ అథ్లెటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, భారతదేశపు ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్, అండర్ ఆర్మర్ లైసెన్సీ తుషార్ గోకుల్‌దాస్ తెలిపారు. (Story : సంసిద్ధత కంటే మించినది సంకల్పం: నీరజ్ చోప్రా)