పోస్ ఆక్ట్ 2013 పై అవగాహన
న్యూస్ తెలుగు/తిరుపతి : మహిళా యూనివర్సిటీ పీఎం ఉష, మహిళా అధ్యయన కేంద్రం, ఐసిడిఎస్ ,ఉమెన్ సేఫ్టీ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా యూనివర్సిటీలో పోస్ ఆక్ట్ 2013 ఫై యుమానిటీ బ్లాక్లోలోని సెమినార్ హాల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్. డి. ఉమాదేవి మాట్లాడుతూ మహిళల లైంగిక వేధింపుల చట్టం ఆవశ్యకతను వివరించారు. ప్రొఫెసర్ సీతా కుమారి మాట్లాడుతూ ఈ చట్టం యొక్క నేపథ్యాన్ని విశాఖ గైడ్లైన్స్ గురించి వివరించారు ఈ సందర్భంగా ప్రొ. సి వాణి విద్యార్థినులను సైబర్ క్రైమ్స్ పట్ల ఏ విధంగా అప్రమత్తం గా ఉండాలో చెప్పారు. శ్రీమతి వాసంతి నోడల్ ఆఫీసర్, ఐసిడిఎస్ తన ప్రసంగం లో పాష్ చట్టం 2013 గురించి విశదీకరించారు శ్రీమతి షబ్రీం తో షర్ తన ప్రసంగంలో గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి లైంగిక వేధింపులు ఎలా ఉంటాయి అని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వివరించారు శ్రీమతి సుజాత వన్ టైం సెంటర్ అడ్మిన్ తన సెంటర్లో కార్యకలాపాలు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి ప్రీతి ప్రాజెక్టు అసిస్టెంట్ డాక్టర్ సుచరిత ఆఫీసు అసిస్టెంట్ డాక్టర్ పద్మావతి డాక్టర్ రాణి డాక్టర్ మాధవి డా. మాధురి పరదేశి డాక్టర్ సునీత విద్యార్థులు పాల్గొన్నారు.(Story : పోస్ ఆక్ట్ 2013 పై అవగాహన )