బిజెపిలో చేరిన మాజీ కౌన్సిలర్ అలివేలమ్మ
వనపర్తి (న్యూస్ తెలుగు) : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పట్టణ చేరికల కమిటీ కన్వీనర్ సబిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్ అలివేలమ్మ బిజెపిలో చేరారు. గతంలో వనపర్తి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 2 వ వార్డు ,11 వ వార్డు నుంచి రెండు పర్యాయాలు కౌన్సిలర్ గా గెలిచి ప్రజా జీవితంలో ఉన్న అలివేలమ్మ 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 14వ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉండి పరాజయం పొందిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న శ్రీమతి అలివేలమ్మను వనపర్తి పట్టణ చేరికల కమిటీ కన్వీనర్ సబిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ విజయానికి స్తబ్దుగా ఉన్న సీనియర్ నాయకులందరూ క్రియాశీలక భూమిక పోషించాలని ఆహ్వానించడంతో అలివేలమ్మ వారి భర్త కేశవాచారి తో కలిసి బిజెపి కండువా కప్పుకోవడం జరిగిందని, రాబోయే పార్లమెంటు ఎన్నికలు, అదే విధంగా వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని అలివేలమ్మగారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి, ఏ.సీతారాములు, జిల్లా కార్యదర్శి చిత్తారి ప్రభాకర్, జిల్లా అధికారుల ప్రతినిధి గొర్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. (Story: బిజెపిలో చేరిన మాజీ కౌన్సిలర్ అలివేలమ్మ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!