తూర్పు కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలి
తూర్పు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు, జిల్లా అధ్యక్షులు రొంగల రామారావు డిమాండ్
విజయనగరం (న్యూస్ తెలుగు): విజయనగరం జిల్లాలో అత్యధిక ఓటింగ్ గలిగిన తూర్పు కాపులకు రానున్న ఎన్నికల్లో ఎంపీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని తూర్పు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు జిల్లా అధ్యక్షులు రంగల రామారావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక తూర్పు కాపు సామాజిక వేదిక వద్ద తూర్పు కాపు పెద్దలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సామాజిక వేదిక అధ్యక్షులు రొంగల రామారావు రాష్ట్ర తూర్పు కాపు ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో తూర్పు కాపులు అత్యధిక జనాభా కలిగినప్పటికీ రాజకీయంగా వెనుక పడుతూనే ఉన్నారని జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఆయా రాజకీయ పార్టీలు తూర్పు కాపులకి కేటాయించాలన్నారు. ఏ పార్టీ అయితే తూర్పు కాపులకు సీట్లు ఇవ్వరో ఆ పార్టీకి ఎటువంటి మద్దతు పలికేది లేదని తెలియజేశారు. కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు ఈ విజయనగరం జిల్లాలో అత్యధిక సీట్లు తూర్పు కాపులకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిలి నాగభూషణ్, మంత్రి రమణ మూర్తి, పిన్నింటి సూర్యనారాయణ, పిన్నింటి చంద్రమౌళి, వెంకటరమణ, రిషికేష్, మాస్టర్ దొంతల శ్రీనివాస్, చెల్లూరురమణ, శ్రీను, పత్తి గుల్ల వెంకట్రావు, గంట్యాడ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. (Story: తూర్పు కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!