Home వార్తలు పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ గా  “డార్క్ నైట్”

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ గా  “డార్క్ నైట్”

0

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ గా 

“డార్క్ నైట్”

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: పూర్ణ ప్రదాన పాత్రలో  P 19 ట్రాన్సమీడియా స్టూడియోస్   పతాకంపై పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన  ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం  “డార్క్ నైట్”. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డబ్బింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు.  పూర్ణ  ఆమె సరసన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), నటించగా విధార్థ్,  సుభాశ్రీ రాయగురు, మిగతా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ : “తెలుగులో ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన  ‘అవును 1,’ అండ్  ‘అవును 2’ చిత్రాలలో పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది, ఆ చిత్రాల తోనే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రాలకు అతీతంగా డార్క్ నైట్ లో ఆమె నటన హైలెట్ గా నిలుస్తుంది. మళ్ళి ఇన్నాలకు ప్రస్తుతం  వస్తున్న చిత్రాలకు అనుగుణంగా ఎమోషనల్ గా సాగే  థ్రిల్లర్ కథతో  “డార్క్ నైట్” చిత్రం నిర్మించబడింది. తమిళ్  రచయిత, దర్శకుడు జి.ఆర్.ఆదిత్యా ఈ చిత్రాన్ని ఆద్యంతం అధ్బుతంగా అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విదంగా ఈ చిత్రాన్ని మలిచాడు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు.  అన్ని విదాల ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది “డార్క్ నైట్” చిత్రం,  మరియు చివరి వరకు వారిని వారి సీట్లకు హత్కునే  విదంగా సన్నివేశాలు వుంటాయి. ఒక విదంగా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్లింగ్ గా ఎమోషనల్ రోలర్‌ కోస్టర్‌లో రన్ అవుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది.” అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్  మిస్కిన్ సిగ్నేచర్ BGMతో,  స్వరపరిచిన నేపథ్య సంగీతంతో థ్రిల్లింగ్ విజువల్స్ కు ఊపిరి పోసాడు.

నటినటులు : పూర్ణ, విధార్ద్, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్),సుభాశ్రీ రాయగురు,రమా తదితరులు నటించారు.
సాంకేతిక వర్గం :
నిర్మాణ సంస్థ : P 19 ట్రాన్సమీడియా స్టూడియోస్,

సంగీతం : మిస్కిన్,
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ముథుకుమార్,
ఎడిటర్ : ఎస్ ఇళయరాజా,
సహా నిర్మాతలు :శ్రీనివాస్ మేదరమెట్ల, జమ్ముల కొండలరావు,
సమర్పణ : పట్లోళ్ల వెంకట్ రెడ్డి,
నిర్మాత: సురేష్ రెడ్డి కొవ్వూరి,
కథ, దర్శకత్వం : జి.ఆర్.ఆదిత్య
పి.ఆర్.ఓ : రాంబాబు వర్మ (Story : పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ గా  “డార్క్ నైట్”)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version