Home ఆధ్యాత్మికం అయోధ్యకు 200 మంది రామ భక్తులు

అయోధ్యకు 200 మంది రామ భక్తులు

0

అయోధ్యకు 200 మంది రామ భక్తులు

ప్ర‌త్యేక రైలులో వెళ్లే రామభక్తులకు స్వీట్లు పంచిన గారపాటి చౌదరి, సిని గేయ రచయిత అనంత శ్రీరామ్

ఏలూరు (న్యూస్ తెలుగు): అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునే రామభక్తుల కోసం మోడీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అస్తా ప్రత్యేక రైలులో ఏలూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 200 మంది భక్తులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ నుండి అయోధ్య ధామ్ కు వెళుతున్న ఈ ప్రత్యేక రైలులో ఏలూరు రైల్వే స్టేషన్ నుండి వెళ్తున్న 200 మంది భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అడిగి తెలుసుకున్నారు. బాలరాముని దర్శనానికి వెళ్తున్న భక్తులకు ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తో కలసి గారపాటి చౌదరి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే 500 సంవత్సరాల పోరాటం, 100 సంవత్సరాల న్యాయ పోరాటం ఫలించి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం పూర్తి అవ్వటంతో బాల రాముని దర్శనానికి జిల్లా నుంచి 200 మంది భక్తులు వెళ్తున్నారని, కొద్దిరోజుల క్రితం తొలి బ్యాచ్ గా 200 మంది అయోధ్యకు వెళ్లి రావటం జరిగిందన్నారు. అయోధ్యకు వెళుతున్న జిల్లా వాసుల ప్రయాణం శుభప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దాన భాస్కర్, దెందులూరు నియోజకవర్గ గుమ్మడి చైతన్య, భీమడోలు మండల అధ్యక్షులు పటేల్ తదితరులు పాల్గొన్నారు. (Story: అయోధ్యకు 200 మంది రామ భక్తులు)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version