UA-35385725-1 UA-35385725-1

సీనియ‌ర్ అసిస్టెంట్ సూర్యారావు సేవ‌లు మ‌రువ‌లేనివి

సీనియ‌ర్ అసిస్టెంట్ సూర్యారావు సేవ‌లు మ‌రువ‌లేనివి

జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.ర‌మేష్‌

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : సీనియ‌ర్ అసిస్టెంట్‌గా ఇ.సూర్యారావు అందించిన సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని డిఐపిఆర్ఓ డి.ర‌మేష్ అభినందించారు. ఆయ‌న సుమారు 44 ఏళ్ల‌పాటు స‌మాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘంగా సేవ‌లందించార‌ని చెప్పారు. విధినిర్వ‌హ‌ణ ప‌ట్ల సూర్యారావు చూపించిన అంకిత‌భావం ఇత‌రుల‌కు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. పార్వ‌తీపురం మన్యం జిల్లా పౌర సంబంధాల శాఖ‌లో సీనియ‌ర్ అసిస్టెంట్‌గా సేవ‌లందించి, ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున ఉద్యోగ విర‌మ‌ణ చేసిన సూర్యారావును శ‌నివారం ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఎడి ర‌మేష్ మాట్లాడుతూ, సూర్యారావు చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.
స‌న్మాన గ్ర‌హీత సూర్యారావు మాట్లాడుతూ శాఖ‌లో త‌న ఉద్యోగ జీవిత‌ అనుభ‌వాల‌ను వివ‌రించారు. తాను 44 ఏళ్ల‌పాటు పార్ట్‌టైమ్‌, కంటింజెంటు, అటెండ‌రు, టైపిస్టు, సీనియ‌ర్ అసిస్టెంట్‌గా ప‌నిచేశాన‌ని, త‌న‌కు విధి నిర్వ‌హ‌ణ‌లో స‌హ‌క‌రించిన అధికారుల‌కు, స‌హోద్యోగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. డిఇఇ ఎస్‌వి ర‌మ‌ణ‌, ఏఇ శ్రీ‌ల‌క్ష్మి, పిఆర్ఓ మ‌జ్జి వాసుదేవ‌రావు, ఎవిఎస్ స‌త్య‌నారాయ‌ణ‌, రికార్డు అసిస్టెంట్ విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ, సూర్యారావు అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. అత‌నితో త‌మకున్న‌ అనుబంధాన్ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో శాఖ సిబ్బంది పాల్గొన్నారు. (Story: సీనియ‌ర్ అసిస్టెంట్ సూర్యారావు సేవ‌లు మ‌రువ‌లేనివి)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1