Home వార్తలు తెలంగాణ 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

0

44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్

వనపర్తి (న్యూస్ తెలుగు) : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, పలు సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ డిమాండ్ చేశారు. గురువారం దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఏఐటీయూసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 29 చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26వేలకు పెంచాలని కోరారు. 73 షెడ్యూల్ జీవోలను సవరించి జీవన ప్రమాణాలకు అనుగుణంగా కొత్త జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హమాలీ, ఆటో, రిక్షా తదితర అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, సొంత ఇల్లు లేని కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. అర్హత ఉన్న కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీవో నెంబర్ 60ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని,వారి జీతాల్లో కోతలు పెట్టటాని ఆపాలన్నారు. అటువంటి ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నరసింహ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సురేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, సహాయ కార్యదర్శి భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీహరి, గోపాలకృష్ణ,పి. భరత్, బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, రాబర్ట్, రమేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. (Story: 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version