వరి పంటలో జింకు ధాతు లోపం
పాలకోడేరు (న్యూస్ తెలుగు): మండలంలో ఈ రబి సీజన్ లో రైతులు 4,600 హెక్టార్ల లలో వారి నాట్లు వేయగా అక్కడక్కడ వరి నాట్లు ఆలస్యంగా వేయడం వలన జింక్ ధాతు లోపం అధికంగా ఉన్నట్లు మండల వ్యవసాయాధికారి నారాయణ రావు తెలిపారు. మండలంలోని పెన్నాడ,గొరగనమూడి గ్రామాల్లో ఈ సమస్యను అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.దీని నివారణ కి రైతులు ప్రతి ఎకరానికి 200 గ్రాములు చిలామిన్,200 గ్రాముల మహా జింక్, వరి పంట మొత్తం తడిచేటట్టు పిచికారి చేసుకోవాలని తెలిపారు. అక్కడక్కడ సల్పైడ్ లోపం కూడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.దీని నివారణ కు చేలను సాధ్యమైనంత వరకు ఎండగట్టడం వలన ఈ సమస్యను అధికమించవచ్చని తెలిపారు. అన్నదాతలకు వ్యవసాయానికి సంభందించిన సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలలోని గ్రామ వ్యవసాయ సహాయకులను ,తనను సంప్రదించాలని తెలియ జేశారు. (Story: వరి పంటలో జింకు ధాతు లోపం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!